English   

మొదటి షెడ్యూల్ ప్యాకప్ చెప్పిన సుక్కూ

Allu Arjun
2019-12-26 14:23:49

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' నటిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా తర్వాతి సినిమాగా అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ ప్రధాన నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా కేరళలో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యిందని అంటున్నారు. నిజానికి కొంత మందిని కేరళకు తీసుకెళ్ళింది సుక్కూ యూనిట్. స్క్రీన్ టెస్ట్ చేయడానికి అని ముందు అనుకున్నా అక్కడ మొదటి షెడ్యూల్ పూర్తి చేసేసారని అంటున్నారు. తొలి షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలలో అల్లు అర్జున్ నటించాల్సి ఉన్నా ఆయన అందుబాటులో లేని కారణంగా వాటిని వదిలేసి మిగతా సీన్లను చిత్రీకరించారు. అధికారికంగా మొదటి షెడ్యూల్ పూర్తయ్యిందని చెబుతున్నా కొన్ని మొదటి షెడ్యూల్ సీన్లు ఇంకా పెండింగ్ ఉన్నట్లు సమాచారం. రెండో షెడ్యూల్ కూడా కేరళలోనే జరగనుందని అంటున్నారు. సంక్రాంతి పండగ సెలవులు అయ్యాక ప్రారంభం కానుందని అంటున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య సిరీస్ వచ్చింది. రెండు సినిమాలు బాగుండడంతో ఈ సినిమా మీద కూడా అంచనాలు నెలకొన్నాయి.  

More Related Stories