English   

సుకుమార్‌ను హర్ట్ చేసిన చిరంజీవి..

Chiranjeevi
2019-12-26 17:51:49

ఏమో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇవే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ కు రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన సుకుమార్ తో సినిమా చేయాలని చిరంజీవి కూడా ఆశ పడుతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు సుకుమార్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అటవీశాఖ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు బన్నీ. రష్మిక మందన హీరోయిన్మ్ ఇక రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయిన అనసూయ ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. 

ఇవన్నీ ఇలా ఉంటే అల్లు అర్జున్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు చిరంజీవి. ఇప్పటికే కథ సిద్ధం చేయాల్సిందిగా సూచించాడు కూడా. అది కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలోనే  తెరకెక్కబోతోంది. ఇక్కడే చిరంజీవి, సుకుమార్ మధ్య చిన్న గ్యాప్ వచ్చినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి కారణం కూడా పెద్దగా ఏం లేదు. ఒక సొంత కథ తీసుకువెళ్లి చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు సుకుమార్. కానీ చిరంజీవి మాత్రం లూసీఫర్ రీమేక్ చేయాలని కోరుతున్నాడు. 

రీమేక్ సినిమాలు చేయడానికి తాను ఆసక్తి చూపించడం లేదని చిరంజీవికి సుక్కు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ మెగాస్టార్ మాత్రం ఈ సినిమాకు సుకుమార్ అయితే న్యాయం చేస్తాడు అంటూ పట్టు పట్టి కూర్చున్నాడని.. అందుకే రామ్ చరణ్ కూడా రంగంలోకి దిగాడని తెలుస్తోంది. ఎలాగైనా సుకుమార్ ని ఒప్పించి లూసీఫర్ రీమేక్ బాధ్యతలు ఆయన చేతుల్లో పెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు మెగా వారసుడు. ఈ విషయంలో చిరంజీవి సుకుమార్ మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో లూసిఫర్ రీమేక్ సుకుమార్ చేస్తాడా లేదా అనేది చూడాలి.
 

More Related Stories