English   

సంక్రాంతి కోడిపుంజులు భారీగానే రెడీ అవుతున్నాయి..

 Ala Vaikunthapurramloo Vs Sarileru Neekevvaru
2019-12-26 18:24:31

సంక్రాంతి సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు.. వ‌ర‌స‌గా సినిమాలు వ‌చ్చేస్తుంటాయి. ఈ సారి కూడా ఇదే జ‌రుగుతుంది. 2019 సంక్రాంతికి నాలుగు సినిమాలు వ‌చ్చాయి. అందులో ఎఫ్ 2 సినిమా మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఆ సినిమాతో పాటు వ‌చ్చిన విన‌య విధేయ రామ‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, పేట సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒకేసారి ఇన్నిసినిమాలు రావ‌డం కూడా దీనికి శాపంగా మారిపోయింది. ఇక ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. 2020 సంక్రాంతికి కూడా 4 సినిమాలు రానున్నాయి. అందులో అంతా స్టార్ హీరోలే ఉండ‌టం విశేషం. 

మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు కూడా సంక్రాంతి పండ‌క్కే రానుంది. ఈ సినిమాను జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేస్తున్నాడు దిల్ రాజు. ఆయ‌న‌కు ఆ తేదీ కూడా బాగానే క‌లిసొచ్చింది. ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు. తాజాగా మరికొన్ని కొత్త పోస్టర్స్ కూడా విడుదల చేసారు. ఆయనకు పోటీగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కూడా తన అల వైకుంఠపురములో సినిమాను పండ‌క్కి.. పైగా మహేష్ వచ్చిన ఒక్కరోజు తర్వాత జనవరి 12నే విడుద‌ల చేస్తున్నాడు. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమా పోస్టర్స్ కూడా ఇప్పుడు సందడి చేస్తున్నాయి. 

మహేష్ బాబు, అల్లు అర్జున్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా జనవరి 15న విడుదల కానుంది. ఈ సినిమా పోస్టర్స్ కూడా ఇప్పుడు విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ మూడు సినిమాలతో పాటు రజినీకాంత్ దర్బార్ కూడా సంక్రాంతికే విడుదల కానుంది. తాజాగా విడుదలైన పోస్టర్స్ లో రజినీ మరింత స్టైల్ గా కనిపిస్తున్నాడు. సంక్రాంతి తర్వాత వస్తుందేమో అనుకుంటే మొన్న విడుదలైన ట్రైలర్ లో సంక్రాంతికి 2020 అంటూ మరోసారి కన్ఫర్మ్ చేసారు మేకర్స్. ఒకేసారి 4 పెద్ద సినిమాలు వ‌స్తే క‌చ్చితంగా అది క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని తెలిసినా కూడా ఎవ‌రికి ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. మ‌రి చూడాలిక‌.. చివ‌రివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో..?

More Related Stories