English   

పట్టు వదలని వర్మ..లెక్క తేలుద్దా

rgv
2019-12-26 18:37:49

తెలుగులో కాంట్రావర్సీకి కేరాఫ్ ఎవరు అంటే అందరూ ముక్త కంఠం చెప్పేది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని. ఆయన మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా సినిమాలు తీసేస్తుంటాడు. ఈ ఇయర్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో సంచలనం సృష్టించిన వర్మ.. ఆ తర్వాత ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సారీ సారీ.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో కావాల్సినంత కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఆ కాంట్రవర్సీతో సినిమాకి ప్రమోషన్స్ అయితే గట్టిగా చేసుకున్నాడు కానీ ఈ సినిమాలో విషయం లేక బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. అయినా అవేవీ పట్టించుకోకుండా షార్ట్ ఫిలిమ్స్ చేసినట్టు సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఇపుడు ‘ఎండర్ ది గర్ల్ డ్రాగన్’ మూవీతో రెడీ అవుతున్న ఆయన నూతన సంవత్సర కానుకగా మరో సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోయిన్ నైనా గంగూలీతో స్టెప్పులేసి అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిన వర్మ విశాఖపట్నంలో ఈనెల 27న ‘బ్యూటిఫుల్’ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. చూద్దాం ఏడాది మొదట్లోనే వర్మకి హిట్ అందుతుందో లేదో ?

More Related Stories