English   

ఆస్తి పంపకాలపై మరోసారి కామెంట్ చేసిన అల్లు అరవింద్..

ar
2019-12-26 19:55:11

అల్లు అరవింద్ ఈ మధ్యే తన 70వ పుట్టినరోజు జరుపుకున్నాడు. అప్పుడే తన కొడుకులకు ఆస్తులు పంచేసాడు. అప్పట్లో ఈ వార్త బాగానే హైలైట్ అయింది కూడా. పెద్ద కొడుకు బాబీ రెండో పెళ్లి కూడా చేసుకోవడంతో ఎవరి ఆస్తి వాళ్లకు ఇచ్చేసాడని టాక్ వచ్చింది. అందులో భాగంగానే పెద్ద కొడుకు వెంకటేష్ కు గీతా ఆర్ట్స్ తో పాటు కొన్ని స్థిరాస్తులు కూడా అల్లు అరవింద్ ఇచ్చేసాడని తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ కు కూడా భారీగానే ఆస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మధ్య ఈయన బయట సపరేట్ గానే ఉంటున్నాడు. పైగా ఈ మధ్యే కొత్త ఇంటికి ముహూర్తం కూడా పెట్టేసాడు. దాంతో అల్లు అరవింద్ కుటుంబం విడిపొడానికి సిద్ధంగా ఉందని అర్థమైపోతుంది. ఇన్నాళ్లూ కలిసే ఉన్నా కూడా ఇప్పుడు కుదిరేలా కనిపించడం లేదు. శిరీష్, అర్జున్, వెంకటేష్ కు సమానంగా ఆస్తులు పంచేసి హాయిగా రెస్ట్ తీసుకోవాలని ఫిక్సైపోయాడు అల్లు అరవింద్. ఇందులో భాగంగానే గీతా ఆర్ట్స్ బాధ్యతలు ఇప్పట్నుంచి పెద్ద కొడుకే చూసుకోబోతున్నాడు. ఇక శిరీష్ కూడా నటనతో పాటు ప్రొడక్షన్ కూడా చూసుకుంటాడని తెలుస్తుంది.

బన్నీ ఎలాగూ నటనతో బిజీ. ఇలా ఎవరికి వాళ్లకు సెటిల్ చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు ఆస్తి పంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు అల్లు అరవింద్. తాజాగా సాయి తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే సినిమా విజయోత్సవంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ సరదాగా కొన్ని కామెంట్స్ చేసాడు. అందులో ఆస్తుల టాపిక్ కూడా వచ్చింది. మెగా కుటుంబానికి నిర్మాత బన్నీ వాస్ వీర విధేయుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన పేరు ముందే బన్నీని తగిలించుకున్నాడంటే ఎంత అభిమానం అనేది అర్థమైపోతుంది. ఇక అల్లు అరవింద్‌కు కూడా బన్నీ వాస్ అంటే చాలా ఇష్టం. అందుకే గీతా ఆర్ట్స్ 2 బాధ్యతలన్నీ ఆయనకే ఇచ్చాడు. తనకు కొడుకు లాంటి వాడు అంటుంటాడు. ఇక్కడే కామెడీ చేసాడు అల్లు అరవింద్. ఇదిలా ఉంటే వాసును తన కొడుకు లాంటి వాడు అన్నప్పుడల్లా తన ఆస్తులు ఎక్కడ రాసిస్తానేమో అని ముగ్గురు కొడుకులు భయపడ్డారని నవ్వించాడు ఈ నిర్మాత. ఈయన మాటలకు అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా పక్కుమని నవ్వేసారు.

More Related Stories