English   

మనవరాలితో మురిపెంగా మెగాస్టార్ చిరంజీవి..

chiru
2019-12-26 20:06:40

మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు తాత కూడా. ఈయనకు చాలా మంది మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. ఈయన సినిమాలతో పాటు కుటుంబంతోనూ గడుపుతున్నాడు. సైరా తర్వాత కొరటాల సినిమాకు సైన్ చేసినా కూడా అది పట్టాలెక్కడానికి ఇంకొన్ని రోజులు పట్టేలా ఉంది. అందుకే ఆ సమయాన్ని కూడా పూర్తిగా ఇంట్లోనే గడిపేస్తున్నాడు చిరు. తాజాగా ఈయన తన చిన్న కూతురు శ్రీజ కూతురు నవిష్క బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అందులో చిరు తన మనవరాలితో దిగిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. ఇది పోస్ట్ చేసింది కూడా చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత. సరిగ్గా ఏడాది కింద క్రిస్మస్ రోజే అంటే డిసెంబర్ 25నే ఓ పాపకు జన్మనిచ్చింది శ్రీజ. ఆమెకు నవిష్క అనే పేరు కూడా పెట్టారు. ఇప్పుడు తన తొలి బర్త్ డే సందర్భంగా చేసుకున్న వేడుక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్‌ దేవ్‌, శ్రీజల ముద్దుల తనయతో ఆడుకుంటూ ఉన్న మెగాస్టార్ ను చూసి మురిసిపోతున్నారు అభిమానులు కూడా. మొత్తానికి ఎంత మెగాస్టార్ అయినా కూడా తాతే కదా అందుకే అలా మురిసిపోతున్నాడు.

More Related Stories