English   

ప్రభాస్ పెళ్లి మీద క్లారిటీ...నవ్వు తెప్పించాయట

pra
2019-12-26 20:28:35

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రభాస్‌. టాలీవుడ్‌లోనే కాదు యావత్ ఇండియన్ ఫిలం స్టార్స్ లో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ప్రభాస్‌ ఒకడు. అందుకే డార్లింగ్‌ పెళ్లి ఎప్పుడా అని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా యంగ్ రెబల్‌ స్టార్‌ పెళ్లి విషయంపై ఆయన పెద్దమ్మ, సీనియర్‌ నటుడు కృష్ణంరాజు సతీమణి స్పందించారు. ప్రభాస్‌ పెళ్లి గురించి అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‌ ప్రస్తుతం జాన్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా పూర్తవగానే ప్రభాస్‌ పెళ్లి పీటలెక్కుతాడని ఆమె క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‌ పెళ్లి కోసం మేం కూడా ఎదురుచూస్తున్నామన్న ఆమె పెళ్లి కూతురు విషయంలో వచ్చిన మీడియాలో వస్తున్న పుకార్లు మాకు నవ్వు తెప్పించాయని అన్నారు. మా కుటుంబంలో కలిసిపోయే తగిన అమ్మాయి కోసం వేడుకుతున్నామని ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని ఆమె పేర్కొన్నారు.

More Related Stories