నాగ్ భలే ప్లాన్ వేశాడే

అక్కినేని నాగార్జున ప్రస్తుతం సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు. నాగ్ నటించిన రీసెంట్ మూవీ మన్మధుడు 2 కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెడుతున్నాడు నాగ్. ఇంకా ఎలాంటి సినిమాను ఓకే చేస్తున్నట్టు ఆయన అఫీషియల్ గా కన్ఫాం చేయలేదు. నిజానికి చేయని నాగ్, తన నెక్ట్స్ మూవీని ఓ కొత్త దర్శకుడితో చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా నాగార్జున సినిమా మొదలెట్టేసి ఒక షెడ్యుల్ కూడా పూర్తి చేసేసాడట. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఓల్డ్ సిటీలో ఐదు రోజుల పాటు ఒక షెడ్యుల్ కూడా పూర్తి చేసేశాడని అంటున్నారు. అయితే అసలు హంగామా అనేదే లేకుండా ఆయన ఎందుకు సినిమా మొదలెట్టేసాడా అనే అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో మొదలయింది.
ఇక ఈ సినిమా గురించి మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో బిగ్ బాస్ అలీ రెజా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఆయనే కాక ఇందులో చాలా మంది కుర్ర వాళ్ళు నటించబోతున్నారట. వీరందరూ పోలీసులుగా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందున్న ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్‌ను అంతర్జాతీయ ఫైట్మాస్టర్స్తో చేయించబోతున్నారని చెబుతున్నారు. నాగ్ ఈ సినిమానే కాకా బాలీవుడ్ లో అమితాబ్‌తో కలిసి బ్రహ్మాస్త్రలో ఓ కీలక పాత్రలో కూడా కనిపించబోతున్నారు. అందులో నిడివి తక్కువే అయినప్పటికీ పాత్రకు ఎక్కువ ప్రాధాన్య ఉండడంతో ఆయన అందులో నటించడానికి ఒప్పుకున్నారు.