English   

చిరంజీవి అభిమానులకు మళ్లీ షాక్.. కొరటాల సినిమా వాయిదా..

chiru
2019-12-27 05:03:01

చిరంజీవి, కొరటాల సినిమా కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోసం ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. పైగా చిరు, కొరటాల సినిమాపై ఇండస్ట్రీలోనే కాదు.. బయట కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను ముందు డిసెంబర్ 26న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పట్లో కొరటాల సినిమా పట్టాలెక్కడం కష్టమే. ఈ సినిమాను జనవరి తర్వాత పట్టాలెక్కించాలని చూస్తున్నాడు కొరటాల శివ. చిరంజీవి ఈ సినిమా కోసం బరువు తగ్గుతున్నాడు. అందుకే మరింత సమయం ఇవ్వాలని చూస్తున్నాడు కొరటాల శివ. రాజమౌళి మాదిరే కొర‌టాల కూడా అపజయం ఎరుగని దర్శకుడు. ఈయన చేసిన నాలుగు సినిమాలు కూడా బాగానే ఆడాయి. భ‌ర‌త్ అనే నేను కాస్త అటూ ఇటూ అయినా.. క‌లెక్ష‌న్లు మాత్రం 90 కోట్ల‌కు పైగానే వ‌చ్చాయి. దాంతో ఇది కూడా అబౌ యావ‌రేజ్ కిందే లెక్క‌. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ లేని ప్ర‌యాణం అన్న‌మాట‌. పైగా సందేశాత్మ‌క క‌థ‌ల‌ను బాగా చెప్తాడ‌నే పేరుంది. క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్ది.. మెసేజ్ లు ఇవ్వ‌డంలో బాగా ఆరితేరిపోయాడు కొర‌టాల శివ‌.. ఇక ఇప్పుడు సైరాతో చిరంజీవి కూడా జోరు మీదున్నాడు. ఠాగూర్ త‌ర‌హాలోనే ఇది కూడా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది.

అయితే ఇందులో దేవాదాయ శాఖలో జరుగుతున్న అరాచకాల గురించి చెప్పబోతున్నాడు దర్శకుడు కొరటాల. దీనికోసం కథ కూడా చాలా పకడ్భందీగా పూర్తి చేసాడు. చిరంజీవి పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. అక్కడ జరుగుతున్న అక్రమాలను వెలికి తీసే పాత్ర ఇది అంటున్నాడు దర్శకుడు కొర‌టాల. చిరు ఇమేజ్ కు తగ్గట్లుగానే ఈ చిత్ర కథ సిద్ధమైంది. ఈ పాత్ర కోసం చిరు బరువు కూడా తగ్గిపోయాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఉంటాడని వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజంలేదని తెలుస్తుంది. కేవలం 90 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి చూపిస్తానంటున్నాడు కొరటాల. షూటింగ్ అంతా కేరళ, హైదరాబాద్ లో ఉంటుందని.. ఎక్కడా ఫారెన్ వెళ్లేది కూడా లేదని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ చిత్రం కోసం విలేజ్ సెట్ తో పాటు ప్రత్యేకంగా గుడి సెట్ కూడా వేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. అదే సినిమాకు ప్రాణం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని.. వాళ్లెవరో త్వరలోనే చెప్తామంటున్నారు మేకర్స్. రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది జులై 30న విడుదలకు సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

More Related Stories