English   

మరో సారి మెగాఫోన్ పట్టనున్న సీనియర్ నిర్మాత

dir
2019-12-27 05:11:50

దర్శకులు, హీరోలు నిర్మాతగా మారడం ఈరోజు చాలా మామూలు విషయం అయిపొయింది. నిర్మాతలే దర్శకులుగా మారడం చాలా అరుదు. ఒక్కడు, వర్షం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన నిర్మాత ఎంఎస్‌ రాజు దర్శకుడిగా మారబోతున్నారు. ఈ సీనియర్‌ ప్రొడ్యూసర్‌ దర్శకుడిగా మారి తూనీగా తూనీగా, వాన చిత్రాలను తెరకెక్కించారు. ఎంఎస్‌ రాజు తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు రెడీ అవుతున్నారని చెబుతున్నారు. ఆ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే కూడా ఎంఎస్‌ రాజునే అందించనున్నారని అంటున్నారు. సతీశ్‌ బాబు, పునీత్‌బాబు అనే కొత్త నిర్మాతలు ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. త్వరలోనే నటీనటుల వివరాలు ప్రకటించనున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను జనవరిలో విడుదల చేయనున్నారట.

 

More Related Stories