English   

వెంకీ మామతో రికార్డ్ సృష్టించిన విక్టరీ వెంకటేష్..

 Venkatesh
2019-12-27 16:03:28

వెంకటేష్ కు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. ఈయన సినిమా అంటే ఈ రోజుల్లో కూడా ఫ్యామిలీస్ పరుగులు పెడుతున్నారు. దానికి తాజా ఎగ్జాంపుల్ వెంకీ మామ. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా వెంకటేష్ ఉన్నాడన్న కారణంతోనే ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. మూడు వారాల్లో ఈ చిత్రం ఏకంగా 72 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలు పోస్టర్స్ కూడా విడుదల చేసారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో వెంకీ మరో రికార్డు సృష్టించాడు. 

వరసగా మూడు విజయాలు పూర్తి చేసి హ్యాట్రిక్ అందుకున్నాడు. ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలకు అందని ద్రాక్ష ఇది. ఒక్క హిట్ కొట్టడమే గగనంగా మారిపోతున్న సమయంలో వరసగా మూడు విజయాలు అందుకున్నాడు వెంకీ. సీనియర్ హీరోలు ఒకప్పుడు చూపించిన ఆ జోరు మాత్రం ఇప్పుడు చూపించడం లేదు. నాగార్జున, బాలయ్య లాంటి హీరోలకు ఒక్క హిట్ వస్తే చాలంటున్నారు. కానీ వెంకీ మాత్రం హ్యాట్రిక్ పూర్తి చేసాడు. వెంకీ మామ విజయంతో వెంకీ వరసగా మూడో విజయాన్ని పూర్తి చేసాడు. 

ఈ ఏడాది మొదట్లో ఎఫ్2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈయన. అందులో వరుణ్ తేజ్‌తో కలిసి నటించాడు. ఇప్పుడు నాగచైతన్యతో హిట్ కొట్టాడు. ఇక 2018ని ఖాళీగా వదిలేసిన ఈయన.. దానికి ముందు ఏడాది గురు సినిమాతో హిట్ కొట్టాడు. ఇలా వరసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు వెంకటేష్. 

ప్రస్తుతం అసురన్ రీమేక్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయన. దాని తర్వాత మరో మూడు సినిమాలు కూడా లైన్‌లో పెట్టాడు విక్టరీ హీరో. ఏదేమైనా ఈ వయసులో హ్యాట్రిక్ అంటే చిన్న విషయం కాదు.

More Related Stories