English   

సుడిగాలి సుధీర్ హీరోగా సక్సెస్ అవుతాడా..

Sudigali Sudheer
2019-12-27 17:36:18

తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కమెడియన్స్ కు ప్రత్యేక ఇమేజ్ ఉంది. కేవలం టెలివిజన్ పై కామెడీ చేస్తారు అని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ లపై చాలా సినిమాల్లో ప్రత్యేక కామెడీ ట్రాకులు కూడా రాస్తున్నారు దర్శకులు. అలాంటి కుటుంబం నుంచి వచ్చాడు సుడిగాలి సుధీర్. పైగా బుల్లితెరపై మంచి ఇమేజ్ ఉంది. యాంకర్ రష్మి గౌతమ్ ఈయన కెమిస్ట్రీ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. దానికి తోడు సుధీర్ లో టాలెంట్ కూడా ఉంది. అందుకే మనోడు బుల్లితెర సూపర్ స్టార్ అయిపోయాడు. 

ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఎం హీరోగా పెట్టి సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమా తీశారు. కొన్ని రోజులుగా విడుదల కోసం నానా తంటాలు పడుతున్నారు ఈ సినిమా డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శేఖర్ రెడ్డి అనే దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉంది. పైగా ఇందులో కూడా జబర్దస్త్ కామెడీ పంచులు వేశాడు సుధీర్. ఆయన అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఈ సినిమా కోసం బాగానే వేచి చూస్తున్నారు. అయితే సుడిగాలి సుదీర్ ని చూడటానికి థియేటర్ వరకూ ప్రేక్షకులు వస్తారా అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వస్తే సుధీర్ పంట పండినట్లే. సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే కానీ ఆయన హీరోగా సక్సెస్ కావడం కష్టం. మరి దాన్ని సుధీర్ ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి. ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటించింది. ఇంద్రజ, నాజర్, దివంగత శివప్రసాద్ లాంటి సీనియర్ నటులు ఇందులో నటించారు. 

More Related Stories