English   

అల వైకుంఠపురంలో ఆయన అలా మాయ చేసాడంట..

Samuthirakani
2019-12-27 17:57:18

అల్లు అర్జున్ అభిమానులు ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమా కోసం ఎంతగా వేచి చూస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా పేరు సూర్య తర్వాత భారీ గ్యాప్ తీసుకోవడంతో ఎప్పుడెప్పుడు తమ హీరో సినిమా చేస్తాడా అని వేచి చూస్తున్నారు వీళ్లు. దానికి తగ్గట్లే కాస్త గ్యాప్ తీసుకున్న కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడితో అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. పైగా మాటల మాంత్రికుడితో ఈయన చేస్తున్న మూడో సినిమా ఇది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల వైకుంఠపురంలో సినిమా వస్తుంది. దాంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. 

ఈ సినిమా టీజర్, పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతి కాసులు కురిపిస్తోంది అని నమ్ముతున్నారు నిర్మాతలు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా టీజర్లో తమిళ నటుడు సముద్రఖని కనిపించింది ఒక్క షాట్ అయినా కూడా ఆయన ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాలో  ఆయన నటన హైలెట్ అవుతుందని అంటున్నారు చిత్ర యూనిట్. ముఖ్యంగా అల్లు అర్జున్, సముద్రఖని మధ్యలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని తెలుస్తోంది. సినిమా మొత్తానికి సముద్రఖని నటన హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెప్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే నటిస్తుంది. 

మొత్తానికి చూడాలిక ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో సముద్రఖని ఎంతవరకు మాయ చేస్తాడో. అన్నట్లు ఆయన రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో కూడా నటిస్తున్నాడు. 

More Related Stories