English   

బాలీవుడ్ నటుడు ఆత్మహత్య.. షాక్ అవుతున్న ఇండస్ట్రీ..

actor
2019-12-27 19:19:23

అసలే ఈ మధ్య ఇండస్ట్రీలో సూసైడ్స్ ఎక్కువైపోతున్నాయి. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ముందు చావును వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు సెలబ్రిటీస్. ఇప్పుడు కూడా ఓ నటుడు ఇలాగే చేసాడు. 37 ఏళ్ల వయసులోనే మూడేళ్ల కొడుకును కూడా వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ టెలివిజన్ నటుడు కుశాల్‌ పంజాబీ సుసైడ్ చేసుకున్నాడు. ఈయన మృతదేహం దగ్గర సూసైడ్‌ నోట్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముంబైలోని బాంద్రాలో తన సొంత ఫ్లాట్ లోనే ఉరి వేసుకుని చనిపోయాడు కుశాల్. ఈయన మరణానికి ఇంకా కారణాలు బయటికి రాలేదు. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదంటూ ఈయన నోట్ రాసిపెట్టాడు. డిసెంబర్ 26 అర్ధరాత్రి బాంద్రాలోని తన సొంతింట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాకు తెలిపారు పోలీసులు.

నిన్నటి వరకు తమతో కలిసున్న వాడే ఇప్పుడు ప్రాణాలతో లేడని తెలుసుకుని టెలివిజన్ ప్రముఖులు అయితే కన్నీరు పెట్టుకుంటున్నారు. ముందు ఈయనది హఠాన్మరణం అనుకున్నారు కానీ తర్వాత ఈయన సూసైడ్ చేసుకున్నాడని తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. ఆయనతో పరిచయం ఉన్న వాళ్లంతా సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తన ఆస్తిని తల్లిదండ్రులు.. కుమారుడికి సమానంగా పంచాలని లేఖలో రాసాడు కుశాల్. జోర్‌ కా జట్కా రియాలిటీ షోలో విజేతగా నిలిచిన కుశాల్‌ ఆ తర్వాత సీరియల్స్ చేసి గుర్తింపు సంపాదించుకున్నాడు. దాంతో పాటే తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నాడు. బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందాడు. ఫియర్‌ ఫాక్టర్‌, నౌటికా నావిగేటర్స్‌ ఛాలెంజ్‌, ఝలక్‌ దిఖ్లా జా తదితర రియాలిటీ షోల్లో పాల్గొని అభిమానులను సంపాదించాడు కుశాల్. ఫర్హాన్‌ అక్తర్‌ లక్ష్యా, కరణ్‌ జోహార్‌ కాల్‌ సినిమాలతో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఏదేమైనా కూడా ఈయన మరణమే ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తుంది

More Related Stories