English   

స్టార్ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చిన సల్మాన్

salman
2019-12-28 07:39:11

బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ సల్మాన్‌ఖాన్‌ నటించిన దబాంగ్‌ 3 సినిమా బాక్సాపీస్‌ వద్ద విజయవంతంగా నడుస్తోంది. ఇక ఈరోజు ఆయన తన 54వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ బర్త్‌ డే వేడుకల తర్వాత తన కొత్త సినిమా రాధే షూటింగ్‌తో బిజీ కానున్నాడు సల్లూభాయ్. ఈ సినిమాని కూడా ప్రభుదేవానే తెరకెక్కించనున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్‌ఖాన్‌ ఓ క్రేజీ ప్రాజెక్టును తిరస్కరించాడట. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ రోహిత్‌శెట్టి సల్మాన్‌తో సినిమా చేయాలని అతన్ని సంప్రదించగా ముందు ఒప్పుకున్నా సల్మాన్‌ ఇప్పుడు నో చెప్పాడని అంటున్నారు. రాజ్ ఎన్ సిప్పీ దర్శకత్వం వహించిన సట్టే పే సట్టా చిత్రాన్ని రీమేక్‌ చేయాలని భావించిన రోహిత్‌శెట్టి పూర్తి స్క్రిప్ట్‌తో సల్మాన్‌ను సంప్రదించగా ఆయనకి కథ పూర్తిగా నచ్చలేదని అంటున్నారు. సల్మాన్ నో చెప్పడంతో రోహిత్‌శెట్టి కాస్త నిరాశకు లోనయినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రోహిత్‌శెట్టి కథను హృతిక్‌రోషన్‌ కూడా తిరస్కరించాడు. రెండో ఆప్షన్ గా ఆయన సల్మాన్ దగ్గరకి వెళ్ళగా సల్మాన్ కూడా ఆయనకు హ్యాండ్ ఇచ్చారు.

More Related Stories