English   

ఆ హీరోయిన్ పెళ్లిని ఫిక్స్ చేసిన పిల్లి

radika
2019-12-28 07:55:01

నిజానికి పెళ్లి కానంత వరకు హీరోయిన్లు ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించేందుకు ఇబ్బంది ఉండదు. కానీ పెళ్లయ్యాక కొన్ని బోల్డ్ సన్నివేశాలలో నటించాలంటే వారికి ఇబ్బందే. కానీ నటి రాధికా ఆప్టే మాత్రం పెళ్లయ్యాకే ఆమె సినిమాల్లోకి వచ్చింది. ఆమె ఏ హీరోయిన్ చేయలేని సీన్లలో నటించారు. కెమెరా ముందు నగ్నంగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఈ విషయంలో తనకు తన భర్త బెనెడిక్ట్ టేలర్‌కు మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదని అంటున్నారు. అయితే పెళ్లికి ముందు ఇద్దరు వ్యక్తుల వల్ల తనకు ఎదురైన వింత అనుభవాన్ని రాధిక తాజా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తానెప్పుడూ నాకంటే చిన్న వయసు వాళ్లతో డేటింగ్ చేయలేదని చెప్పిన ఆమె పెళ్లికి ముందు ఒకే రోజు ఇద్దరు అబ్బాయిలు నన్ను డేటింగ్‌కు రమ్మన్నారని చెప్పింది. వారిలో తన భర్త బెనెడిక్ట్ ఒకరని చెప్పింది. తనకు ఏంచేయాలో తెలీక తన రూంమేట్ తో కలిసి ఒక నిర్ణయానికి వచ్చామని నేను టూనా చేపను వండి మా ఇంటికి వచ్చే పిల్లికి పెట్టా. ఒకవేళ ఆ పిల్లి నేను వండిన టూనా చేపను తింటే బెనెడిక్ట్‌తో డేటింగ్‌కి వెళ్లాలని తినకపోతే మరో కుర్రాడితో డేటింగ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నానని. ఆ పిల్లి చేపను తినడంతో బెనెడిక్ట్‌తోనే డేటింగ్‌కు వెళ్లానని ఇప్పుడు నేను ఆయన్నే పెళ్లి చేసుకున్నాను’’ అని వెల్లడించారు. బెనెడిక్ట్ లండన్‌కు చెందిన ప్రముఖ మ్యుజిషియన్ కాగా వీరిద్దరి పెళ్లిని ఆ పిల్లి ఫిక్స్ చేసిందన్నమాట.  

 

More Related Stories