English   

హీరో రాజ్ తరుణ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు..

raj
2019-12-28 08:07:37

ఉదయ్ కిరణ్ మాదిరే హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చాడు రాజ్ తరుణ్. నాగార్జున నిర్మించిన ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్.. సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. కానీ ఆ తర్వాత మాత్రమే ఆయనకు అనుకున్న విజయాలు రాలేదు. వరుసగా పరాజయాలు రావడంతో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా పడిపోయాడు ఈ కుర్రహీరో. గత కొన్నేళ్లుగా వరస ఫ్లాపులు ఇస్తున్న రాజ్ తరుణ్ ఇప్పుడు మరో డిజాస్టర్ ఇచ్చాడు. కెరీర్ పూర్తిగా ముగింపు దశలో ఉన్నప్పుడు దిల్రాజు నిర్మాణంలో ఇద్దరి లోకం ఒకటే సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమా రావడంతో కనీసం రాజ్ తరుణ్ మళ్లీ హిట్ కొట్టి తనను తాను నిరూపించుకుంతాడని ఆశించారు అభిమానులు. జి ఆర్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అత్యంత దారుణంగా డిజాస్టర్ అయిపోయింది. రాజ్ తరుణ్ కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమాకు రానంత నెగిటివ్ టాక్ ఈ సినిమాకు వచ్చింది. ఈ సినిమా ఏవైనా మాయ చేస్తుందేమో మరో రెండు మూడు అవకాశాలు అందుకుందామని రాజ్ తరుణ్ పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా చంపేసింది ఇద్దరి లోకం ఒకటే. తొలిరోజు ఈ సినిమాకు కేవలం 15 లక్షలు మాత్రమే వచ్చాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాజ్ తరుణ్ అని హీరో తెలుగు ఇండస్ట్రీకి గత చరిత్ర అయిపోతున్నాడేమో అనిపిస్తుంది.

More Related Stories