English   

ప్రతిరోజూ పండగే ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Parthi Roju Pandage
2019-12-28 10:42:12

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తజా సినిమా ప్రతిరోజూ పండగే క్రిస్మస్ సందర్భంగా 20న విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తొలిరోజే మంచి టాక్ రావడంతో పాటు పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమాకు బాగా కలిసొచ్చింది. ఈ సినిమా రిలీజయిన రోజున నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమా రిలీజ్ అయినప్పటికీ ఆ సినిమాకి దారుణమైన టాక్‌ రావడంతో ప్రేక్షకులు ప్రతిరోజూ పండగే సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా తొలి వీకెండ్ హౌజ్‌ఫుల్ షోలతో సందడి చేయగా వీక్ డేస్‌లోనూ కలెక్షన్ల పరంగా మంచి డ్రాప్ కాకుండా నిలబడింది.దీంతో ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.19.94 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి వారం 17.14 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. పూర్తి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో తేజు సరసన రాశిఖన్నా హీరోయిన్‌గా నటించింది. రావు రమేష్ ఈ సినిమాకే హైలైట్ గా నిలిచాడు. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 7.35 కోట్లు, సీడెడ్ – 2.11 కోట్లు, నెల్లూరు – 0.54 కోట్లు, కృష్ణా – 1.24 కోట్లు, గుంటూరు – 1.20 కోట్లు, వైజాగ్ – 2.55 కోట్లు, ఈస్ట్ – 1.23 కోట్లు, వెస్ట్ – 0.92 కోట్లు, టోటల్ ఏపీ+తెలంగాణ – 17.14 కోట్లు, రెస్టాఫ్ ఇండియా – 1.10 కోట్లు ఓవర్సీస్ – 1.70 కోట్లు మొత్తం కలిపి వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – 19.94 కోట్లుగా ఉన్నాయి.

More Related Stories