English   

మహేష్ తన పని పూర్తి చేశాడట 

Mahesh Babu
2019-12-28 10:53:09

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పుడు వరసగా ఐదు సోమవారాలు ఐదు పాటలు విడుదల చేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. జనవరి 11న సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ప్రతీ ఒక్కటి ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన కొన్ని పాటలు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా అందుతున్న స‌మాచారం ప్రకారం ఈ సినిమాలో మ‌హేష్ త‌న డ‌బ్బింగ్‌ను పూర్తి చేసినట్టు చెబుతున్నారు. ఇంక మిగిలిన పాత్రల డబ్బింగ్ కూడా త్వరలోనే పూర్తి కానుందని అంటున్నారు. మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన న్యూ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ స్టిల్‌‌లోని హీరో మహేశ్ బాబు, నటి విజయశాంతి సీరియస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో విజయశాంతి రోల్ కీలకంగా ఉండబోతోందని ఈ స్టిల్ చూస్తుంటే అర్థమవుతోంది.

More Related Stories