English   

బాలీవుడ్ మీద పూరీ కాంబో నజర్...అక్కడివాళ్ళే కావాలట

Vijay Devarakonda
2019-12-28 17:59:51

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లాలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో  ఫైటర్ అనే సినిమా మొదలు కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడట. ఈ సినిమా  పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మీ ) నిర్మాణ సారథ్యంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై షూట్ జనవరిలో ప్రారంభం కానుంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయిక గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నట్టే చెబుతున్నారు. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సహ నిర్మాత గా జాయిన్ కావడంతో, ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారు. బాలీవుడ్ ని కూడా వాడుకునేలా ఈ సినిమా ముఖ్యపాత్రలకు బాలీవుడ్ యాక్టర్స్ ను కూడా ఎంపిక చేయనున్నారు. దర్శక, నిర్మాత పూరి జగన్నాథ్, నిర్మాత కరణ్ జోహార్, హీరో విజయ్ దేవరకొండ లీడ్ యాక్టర్స్ ను ఎంపిక చేయడం లో బిజీ గా ఉన్నారు. ఇక మిగతా పాత్రల కోసం కూడా పూరీ కేవ్ నుండి క్యాస్టింగ్ కాల్ వెలువడింది. వివిధ పాత్రల కోసం నటీనటులు కావాలని ఆది కూడా ముంబై బేస్డ్ వాళ్ళు కావాలని. చూడాలి ఈ సినిమా పూరీ విజయ్ లను ఏ రేంజ్ కి తీసుకు వెళ్తుందో ?

More Related Stories