English   

మహేష్ తో కూడా సినిమా...పరశురామ్ క్లారిటీ 

 Parasuram
2019-12-28 12:03:57

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా గీతా గోవిందం సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న యువ దర్శకుడు పరశురామ్‌ కి ఈ సినిమాతో పరుసురాం కి వరుస అవకాశాలు వస్తాయని అందరు అనుకున్నారు. కానీ ఆయన విచిత్రంగా సైలెంట్ అయిపోయారు. ఆ మధ్య మహేష్ బాబు, అల్లు అర్జున్ , అఖిల్ తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగినా అవి వర్కౌట్ కాలేదు. ఎట్టకేలకి అది నాగ చైతన్యతో ఫిక్స్ అయింది. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇది నాగ చైతన్యకి 20వ సినిమా. ఈ నాగ చైతన్యతో సినిమా తర్వాత మహేష్ తోనే తన సినిమా ఉంటుందని పరుశురాం చెప్పుకొచ్చారు. నాగ చైతన్య సినిమా అయిపోయిన తర్వాత మహేష్ బాబు సినిమాపై వర్క్ చేస్తానని.. ఇప్పటికే స్టోరీ లాక్ అయిందని గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే ఈ సినిమా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తాజాగా విశాఖపట్నం దగ్గరలోని అడివివరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్నాడు పరశురామ్‌. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్‌తో చేయబోయే సినిమాకు కథ సిద్ధంగా ఉందన్న పరశురామ్‌, నాగచైతన్య మూవీ పూర్తయిన వెంటనే మహేష్ సినిమాను ప్రారంభిస్తానని తెలిపాడు.   

More Related Stories