English   

అర్జున్ సురవరం ఫైనల్ కలెక్షన్స్.. నిఖిల్ బ్యాక్ టూ ఫామ్..

Arjun Suravaram
2019-12-28 16:46:11

ఆ మధ్య వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో దండయాత్ర చేసిన నిఖిల్ తర్వాత ఒక్కసారిగా చల్లబడిపోయాడు. కేశవ సినిమాతో యావరేజ్ దగ్గరే ఆగిపోయిన నిఖిల్ కిరాక్ పార్టీతో అంచనాలు అందుకోలేకపోయాడు. ఈ సినిమా విజయం సాధిస్తుందని ఈ కుర్ర హీరో చాలా నమ్మాడు. కన్నడలో చరిత్ర సృష్టించిన కిరిక్ పార్టీ తెలుగులో మాత్రం డిజాస్టర్ అయిపోయింది. ఈ మధ్యే ఆయన నటించిన అర్జున్ సురవరం విజయం సాధించి మళ్లీ ఈయనకు మంచి రోజులు వచ్చేలా చేసింది. ఈ చిత్రం ఏడాది వాయిదాల తర్వాత విడుదలైనా కూడా మంచి విజయమే సాధించింది. నవంబర్ లో మరో సినిమా లేకపోవడంతో బాగానే దండుకుంది ఈ సినిమా. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అర్జున్ సురవరం.. ఏకంగా 9.80 కోట్ల షేర్ వసూలు చేసి సూపర్ హిట్ అయింది. తమిళనాట విజయం సాధించిన కణితన్ సినిమా రీమేక్ ఇది. నకిలీ సర్టిఫికెట్ల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో నిఖిల్ జర్నలిస్టు పాత్రలో నటించాడు. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఛానల్ అయిన టీవీ99లో పని చేస్తుంటాడు. దాంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా అర్జున్ సుర‌వ‌రం సినిమాకు కలిసొచ్చింది. నవంబర్ 28న విడుదలైన ఈ చిత్రం అంచనాలు అందుకుంది. నైజాంలో అయితే 3.80 కోట్ల షేర్ వసూలు చేసింది. అన్నిచోట్ల కలిపి 10 కోట్లకు చేరువగా షేర్ తీసుకొచ్చింది. దాంతో నిఖిల్ కోరుకున్న విజయం మళ్లీ వచ్చింది. ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. చందూ మొండేటి దీనికి దర్శకుడు.

More Related Stories