English   

బాలయ్య గొప్ప మనసు...నిర్మాత హ్యాపీ ?

nbk
2019-12-28 20:51:57

కొంతమంది హీరోలు తెరమీదే కాదు, బయట కూడా పెద్ద మనసు చూపిస్తుంటారు. సినిమా నష్టాల పాలైతే, తమ వంతు బాధ్యతగా ఎంతో కొంత తిరిగి చెల్లిస్తుంటారు. ఇది మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇప్పుడు బాలయ్య కూడా అదే పని చేస్తున్నట్టు తెలుస్తోంది. సి,కల్యాణ్ నిర్మాతగా తెరకెక్కిన `రూలర్‌` సినిమా ఈనెల 20న విడుదలై బాలయ్య కెరీర్ లో పెద్ద డిజాస్టర్‌ గా మిగిలిపోయింది. 40 కోట్లతో ఈసినిమా తీస్తే, పట్టుమని పది కోట్లు కూడా వెనక్కి రాలేదు. డిజిటల్‌, శాటిలైట్ లేకపోతే కల్యాణ్ నిండా మునిగేవాడు. అవి కొంతలో కొంత ఒడ్డున పడేశాయి. అయితే ఆయన భారీ నష్టాల్ని భరించాల్సివస్తుందని తెలుస్కున్న బాలయ్యతన వంతు సాయం అందించడానికి రెడీ అయ్యాడు. తన పారితోషికంలో అన్తాకాకున్నా కొంత మొత్తం ఇరిగి వెనక్కి ఇస్తానని బాలయ్య మాట ఇచ్చాడట. అంతే కాదు ఈ నష్టం తీర్చడానికి మరో సినిమా కూడా చేస్తా అని మాటిచ్చాడట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్యతో మరో సినిమా చేసేందుకు కల్యాణ్ ధైర్యం చేయడం లేదు. పైకి మరో సినిమా చేస్తానని చెబుతున్నా ఇప్పుడు బాలయ్యతో సినిమా చేసే ఉద్దేశంలో మాత్రం కల్యాణ్ లేడనే అంటున్నరు. దీంతో పారితోషికంలో కొంత భాగం వెనక్కి ఇస్తే చాలని కల్యాణ్ ఎదురు చూస్తున్నాడని అంటున్నారు.

More Related Stories