English   

రిటైర్డ్ ఆఫీసర్ వద్ద శిక్షణ తీసుకోనున్న రానా

rana
2019-12-29 07:07:20

నీది నాదీ ఒకే కధ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా సాయి పల్లవి నక్సలైట్ గా నటిస్తున్నారని అంటూ రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. అయితే తాజాగా మరో ప్రచారం ఊపందుకుంది. అదేంటంటే ఈ సినిమాలో రానా పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమాలో తన పాత్రలో ఈజ్ కోసం రానా రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాడని ప్రచారం జరుగుతోంది. జనవరి మొదటివారంలో రానా తన కొత్త గురువు వద్ద శిక్షణ మొదలు పెడతాడని టాక్‌. రైఫిల్‌ షూటింగ్‌, ఆత్మరక్షణ మెలకువలు, ఇతర అంశాల్లో రానా శిక్షణ తీసుకోనున్నట్లు సినిమా వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయింది.

 

More Related Stories