English   

మందేసి నిర్మాత మీద దాడి చేసిన హీరోయిన్

act
2019-12-29 08:47:54

నిర్మాతపై దాడి చేసిన హీరోయిన్..ఇదేదో సినిమాలో సీన్ అనుకునేరు నిజమే నండోయ్. అది కూడా ఎక్కడో బాలీవుడ్ హీరోయిన్ అనుకునేరు కాదు తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు చేసి ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ మీద ద్రుష్టి పెట్టిన హీరోయిన్. ఆమె ఎవరో కాదు సంజనా. అదేనండీ బుజ్జిగాడు మేడిన్ చెన్నై స‌హా ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకున్న హీరోయిన్ సంజ‌నా ఒక ప‌బ్‌లో మ‌ద్యం తాగి ర‌చ్చ ర‌చ్చ చేసింది. బాలీవుడ్ నిర్మాత వంద‌నా జైన్ పోలీసుల‌కు సంజ‌నా గ‌ర్లాని త‌న‌పై మ‌ద్యం బాటిల్‌, గ్లాస్ తీసుకుని దాడి చేసింద‌ని ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు బెంగ‌ళూరు క‌బ్బ‌న్ పార్క్ ప‌రిధిలో కూంఝీ బార్‌లో పార్టీ జ‌రిగింది. ఆ పార్టీ ఇచ్చింది కూడా సంజనానే నట. ఈ పార్టీకి ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. ఒకే టేబుల్‌పై కూర్చున్న వంద‌నా జైన్‌, సంజ‌నా గ‌ర్లాని మ‌ద్యం సేవించారు. ఇద్దరి మాట‌లు మ‌ధ్య స్టార్ట్ అయిన చిన్న మాటామాట గొడ‌వగా మారిందట. దీంతో అక్కడున్న మిగ‌తావారు ఇద్దరికీ న‌చ్చచెప్పినా ఇద్దరూ తగ్గలేదట.  అయితే వంద‌నా క‌బ్బన్ పార్క్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి సంజ‌నా త‌న‌పై బాటిల్ తో దాడికి ప్రయ‌త్నించింద‌ని ఫిర్యాదు చేశారు. అయితే వంద‌నా త‌న‌ను దూషించ‌డంతో పాటు త‌న చేయిని మెలిపెట్టింద‌ని, దాంతో తాను వంద‌నా జైన్ మీద చేయి చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని సంజనా వర్షన్ సంజనా చెబుతోంది. ఇంతకీ అసలు ఏమయిందో ఆ ఇద్దరికే తెలియాలి.

More Related Stories