English   

పవన్ మీద ఆ ఛానల్ స్పెషల్ మేగజైన్...సోషల్ మీడియాలో ట్రోల్స్ !

pk
2019-12-30 05:14:39

తర తరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే...ఇదేదో పవన్ కళ్యాణ్ సాంగ్ లా ఉందే అనుకుంటున్నారా ? అవును నిజమే. ఈ పాత పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలోది. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఇదే పేరుతో జనసేన సొంత ఛానెల్ ఒక స్పెషల్ మ్యాగజైన్ ప్రచురించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా స్వదేశం అయిన రష్యాకి వెళ్ళాడు. అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ప్రతి ఏడాది అత్త గారింటికి వెళ్లి క్రిస్మస్ జరుపుకోవడం ఆయనకి పరిచర్యగా మారింది. పవన్ కళ్యాణ్ విదేశాలలో ఉండడంతో పార్టీ తరపున ఆయనే ఏకైక వాయిస్ కావడంతో జనసేన పార్టీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేదు. అందుకే ముందుగానే ఈ మ్యాగజైన్లు ప్లాన్ చేసిన 99 టీవీ తర తరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే పేరుతో వెలువడిన ప్రత్యేక సంచికలో పవన్ గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ వెలువరించింది.

ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియాలో కూడా ప్రకటిందింది. 99 టీవీ అనే న్యూస్ ఛానల్ ను ఆ పార్టీ నేత తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆ న్యూస్ ఛానలే ఈ ప్రత్యేక సంచికను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఒక విషయం స్పురణకి వస్తోంది. అదేదో సినిమాలో డప్పు కొట్టే వ్యక్తి అసెంబ్లీకి ఎన్నికయితే అక్కడ కూడా డప్పు కొట్టాలా అని అమాయకంగా అడుగుతాడు. అప్పుడు హీరో అక్కడ ఎవడి డప్పు వాడు కొట్టుకుంటాడు నీకు పనుండదు అంటాడు. ఇప్పుడు ఇలాంటి ఉదాహరణలే చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు వివిధ పార్టీలకి చెందిన వ్యక్తులు. అయితే ఆ చానల్ పవన్ కోసం ఆయన పార్టీ కోసమే పని చేస్తుందని తెలిసి కూడా ఇలాంటి సంచికలు విడుదల చేయడమనేది అభిమానుల కోసమే అని పవన్ అనుకూల వర్గం వాదిస్తోంది.

 

More Related Stories