English   

మరో టెన్షన్ లో ఎన్టీఆర్...అన్ని ఈవెంట్స్ రద్దు

ntr
2019-12-30 05:22:48

టాలీవుడ్ యంగ్ టైగర్ గురించిన న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఆయన టెన్షన్ లో ఉన్నాడట. ఎందుకయ్యా టెన్షన్ అంటే  ఆయన బాబాయ్ కి ఆరోగ్యం అసలు బాలేదట. అయ్యో బాబాయ్ అంటే బాలకృష్ణనో, రామకృష్ణనో అనుకునేరు కాదు ఈయన తల్లి తరపు బంధువు అట. పిన్ని భర్త అయిన ఆయన ..ఎన్టీఆర్ ను చిన్నప్పటి నుంచి బాగా చూసుకుంటూ, ఎత్తుకుని పెంచాడట. ఇప్పుడు ఆయన ఆరోగ్యమే విషమంగా ఉందని అందుకే ఆయన టెన్షన్ లో ఉన్నాడని కొన్ని వెబ్ సైట్స్ వార్తలు ప్రచురించాయి.  ఆయనను ప్రస్తుతం బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో చేర్చారని ఆయన ఆరోగ్యం అసలు బాలేదని, పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్నారు. దాంతో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆ తర్వాత హాస్పటల్ అంటూ ఆయన చుట్టే తిరుగుతున్నాడట. నిజానికి గతేడాది లోనే తండ్రిని పోగొట్టుకున్నాడు ఎన్టీఅర్. అందుకే ఈయన విషయంలో అంత టెన్షన్ పడుతున్నట్టు, చెబుతున్నారు. నిజానికి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడివురా చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ను పిలిచి సినిమాకి హైప్ క్రియేట్ చేయాలని అనుకున్నప్పటికీ ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను కాకుండా మరో పెద్ద హీరోతో ఆ వేడుక జరిపించాలని చిత్ర యూనిట్ చూస్తున్నట్లు చెబుతున్నారు. దీని మీద మరింత సమాచారం అందాల్సి ఉంది.

More Related Stories