English   

అల్లు అర్జున్ కోసం అత్తారింటికి దారేది సెంటిమెంట్ ఫాలో అవుతున్న త్రివిక్రమ్..

Allu Arjun Trivikram Srinivas.jpg
2019-12-30 09:01:05

అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురంలో సినిమాపై అంచనాలు ఎంతగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. జనవరి 12న భారీ అంచనాలతో అల వైకుంఠపురంలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జనవరి 6న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ లైన్స్ లో జరగనుంది. దీని కోసం ఏర్పాట్లు కూడా భారీగానే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. గతంలో రంగస్థలం, వినయ విధేయ రామ ఇలాంటి ఈవెంట్స్ ఇక్కడే జరిగాయి. ఇప్పుడు బన్నీ కోసం కూడా అదే స్టేడియంలో ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథులు ఎవరూ రావడం లేదు.

జూనియర్ ఎన్టీఆర్ వస్తాడనే ప్రచారం జరిగినా కూడా ఇప్పుడు ఆయన కూడా రావడం లేదని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్ సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్తున్నారు.

దాంతో అల వైకుంఠపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అతిథులు ఎవరు లేకుండా పూర్తి చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది ప్రీ రిలీజ్ వేడుక కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా కేవలం సినిమా యూనిట్ మాత్రమే వచ్చారు. ఇప్పుడు అదే చేయబోతున్నాడు మాటల మాంత్రికుడు. బన్నీ సినిమా కోసం కేవలం సినిమా కాస్ట్ అండ్ క్రూ మాత్రమే వస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

More Related Stories