English   

రోజాతో ఆడుకుంటున్న జబర్దస్త్ కమెడియన్స్..

 Jabardasth Comedians
2019-12-30 11:24:46

జబర్దస్త్ కామెడీ షో నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఆ బాధ్యత మొత్తం ఒంటరిగా మోస్తుంది రోజా. ఇక ఇందులో ఏమి చేసైనా కూడా కామెడీ రాబట్టవచ్చని సర్వహక్కులు కమెడియన్స్ కు ఇచ్చేసారు మల్లెమాల ప్రొడక్షన్స్. దాంతో వాళ్లు రెచ్చిపోతున్నారు. మరీ ముఖ్యంగా జడ్జి రోజా పైన దారుణమైన పంచులు వేస్తున్నారు. హైపర్ ఆది సుడిగాలి సుదీర్ లాంటి టీం లీడర్స్ రోజా చేస్తున్న బతుకు జట్కాబండి ప్రోగ్రాంతో ఆడుకుంటున్నారు. కావాలనే మాటిమాటికి జబర్దస్త్ లో ఈ తరహా స్కిట్ లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. జీ తెలుగులో బతుకు జట్కాబండి మంచి పేరుంది. విడిపోయే జంటలను న్యాయనిర్ణేతగా కూర్చుని కలపడం ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్. దీన్ని ఇప్పుడు జబర్దస్త్ లో కిచిడి చేస్తున్నారు కమెడియన్లు. మొన్నటికి మొన్న హైపర్ ఆది ఇలాంటి స్కిట్ ఒకటి చేశాడు. ఇక వచ్చే వారం కూడా బతుకు జట్కాబండి స్పూఫ్ చేస్తున్నాడు హైపర్ ఆది. స్కిట్ లో భాగంగా కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చే ఆది.. రోజా ఆశీస్సులు తీసుకుందామని భార్య అడిగితే అక్కడికి వెళ్లడానికి ఇంకా టైం ఉంది అంటూ పంచ్ వేస్తాడు. అదేంటి అని అడిగితే ఆమె దగ్గర ఆశీస్సులు ఉండవు.. అక్కడ ఇక్కడ రెండు కుర్చీలు ఉంటాయని బతుకు జట్కా బండి పై భయంకరమైన సెటైర్ వేసాడు హైపర్ ఆది. ఇక న్యూ ఇయర్ ఈవెంట్ లో కూడా సుడిగాలి సుదీర్ ఇలాంటి స్కిట్ ఒకటి చేశాడు. పైగా దానికి రోజా సపోర్ట్ చేయడం గమనార్హం. ఏదేమైనా కూడా జబర్దస్త్ లో రోజా పైనే ఎక్కువ సెటైర్లు పడుతున్నాయి. 

More Related Stories