English   

ఆ సూపర్ హిట్ జోడీ అలా కనిపించబోతున్నారా 

Chiru Vijayashanthi
2019-12-30 11:36:20

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, విజయశాంతి జోడికి భలే క్రేజ్ ఉంది. వీళ్లిద్దరు కలిసి 19 సినిమాల్లో జోడిగా కలిసి నటించారు. వీళ్లిద్దరు మరోసారి జోడి కట్టబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే కొరటాల సినిమాలో నటిస్తోంది తానేనని త్రిష క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం మరగున పడింది. తొలిసారి చిరు, విజయశాంతిలు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘సంఘర్షణ’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక వారు జోడిగా నటించిన చివరి సినిమా ‘మెకానిక్ అల్లుడు’. బి.గోపాల్ దర్శకత్వంలో అల్లు అరవింద్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. అయితే సినిమా కూడా చేయడం లేదని తెలిశాక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా ?  తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది  విజయశాంతి. సుమారు 13 ఏళ్ల తర్వాత ఆమె మళ్ళీ మేకప్ వేసుకుంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జనవరి-5న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ఈ వేడుకకు రాములమ్మ కూడా రాబోతుందట. అంటే చిరు, విజయశాంతిని ఇద్దరిని చాలా రోజుల తర్వాత ఒకే స్టేజ్‌పై అభిమానులు చూడబోతున్నారని అంటున్నారు. నిజమే అన్నేళ్ల తర్వాత అది కూడా ఆమె రీ ఎంట్రీ సినిమా ఫంక్షన్ కి చిరు రావడం అంటే విశేషమే మరి.
 

More Related Stories