చలిలో చలిదేశంలో...వైరల్ గా విరుష్క పిక్

ఈ మధ్యన సెలబ్రిటీలు పూర్తిగా ఇండియాలో వెకేషన్ ఎంజాయ్ చేయడం మానేసినట్టున్నారు. మన టాలీవుడ్ మొదలు అందరూ విదేశాలకు క్యూ కడుతున్నారు. ప్రైవసీ కోసమో ఇంకోటి ఏమన్నా ఉందో కానీ అందరూ ఆ బాటే పడుతున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జీవిత భాగస్వామి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి స్విట్జర్లాండ్‌లో చక్కర్లు కొడుతున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఘన విజయం సాధించి ఊపు మీదున్న ఈ కుర్ర క్రికెటర్ కొత్త సంవత్సరం సంబరాలను చేసుకోవడానికి స్విట్జర్లాండ్‌లోని జిస్టాద్కు చేరారు. అక్కడ మంచు కొండల్లో విహరిస్తున్న ఫోటోలను కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విజయోత్త్సాహంతో ఉన్న భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా తమ కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు. రోహిత్ శర్మ తమ కుటుంబంతో కలిసి ముంబయిలోని జియో వండర్ ల్యాండ్‌ను సందర్శించాడు. జడేజా తన భార్య రివా సోలంకితో లండన్‌లో విహరిస్తున్నాడు. అసలే చలి కాలం ఇంకేముంది అలా కానిస్తున్నరు.