English   

ఏపీకి దూరం అవుతున్న సినీ పరిశ్రమ

Tollywood
2019-12-30 13:19:37

కారణం ఏమిటో తెలీదు కానీ సినిమా ఇండస్ట్రీకి ఏపీలో ఆరునెలల క్రితం ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి అంతగా బాండింగ్ ఏర్పడలేదు. ఎన్నికల ముందు కొంత మంది కమెడియన్లు ఆయన చెంత చేరి తమ మద్దతు ప్రకటించారు. అయితే ఆయన గెలిచాక ఎవరూ జగన్ ను కలిసి అభినందించలేదు అంటూ కమెడియన్ పృథ్వి చేసిన కామెంట్స్ రచ్చ రేపాయి కూడా. అయితే ఇప్పుడు ఇదంతా  మీద కక్షతో ఇప్పుడు చేయిన చాలా పనులను ఆపేస్తు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే సినిమా షూటింగ్స్ కు గతంలో ఇచ్చే పర్మిషన్స్ ని కఠిన తరం చేసిందట. అందుకే మనవాళ్ళు ఏపీలో షూట్స్ క్యాన్సిల్ కూడా చేస్తున్నట్టు సమాచారం. అంతేకాక న్యూ యియర్ ఫంక్షన్స్ కి కూడా పోలీస్ లు అనేక అభ్యంతరాలు చెప్పడంతో రికార్డు స్థాయిలో రద్దు చేయబడ్డాయి అని అంటున్నారు. అంతేకాక అల వైకుంఠ పురంలో ఈవెంట్ కి కూడా పర్మిషన్ ఇవ్వక పోవడంతో దానిని హైదరాబాద్ లో నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక రామ్ నటిస్తున్న తడం రీమేక్ రెడ్ యూనిట్ కి కూడా షాక్ ఇచ్చారట. దీంతో ఏపీలో షూట్ చేయడం కంటే గోవా లాంటి చోట్ల చేసుకోవడం మంచిది అని భావిస్తున్నట్టు సమాచారం. ఇది ఎంత వరకు వెళుతుందో అనేది వేచి చూడాలి.

More Related Stories