English   

ఎన్టీఆర్ తో సినిమా లేదు...కానీ 

Murugadoss
2019-12-30 13:36:56

తన నెక్ట్స్ ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ తోనే అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు దర్శకుడు మురుగదాస్. తాను ఎన్టీఆర్ తో సినిమా తీస్తానన్న వార్తల్లో నిజం లేదని తెలిపాడు. చాలాకాలం కిందట ఎన్టీఆర్ కు కథ వినిపించింది నిజమేనని, కానీ అది ఫైనలైజ్ కాలేదని వివరించారు. కొంతకాలంగా ఎన్టీఆర్ ను తాను కలవలేదని చెప్పాడు. రీసెంట్ గా మురుగదాస్ దర్బార్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్..నయనతార జంటగా నటించారు

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ లలో మురుగదాస్ ఒకరు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా ఎదిగారు మురుగదాస్. తాజాగా అయన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తో దర్బార్ అనే సినిమా తెరకెక్కించాడు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రజనీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దక్షిణాదిన అన్ని భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టింది చిత్ర యూనిట్. అందులో భాగంగా దర్శకుడు మురుగదాస్‌ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తెలుగులో మురుగదాస్‌ చిరంజీవితో స్టాలిన్‌, మహేష్ బాబు తో స్పైడర్‌ సినిమాలను డైరెక్ట్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు సినిమాలు ప్లాప్ కావడానికి నేనే కారణమని ఆయన తాజాగా చెప్పుకొచ్చాడు. 

తెలుగు ప్రేక్షకుల పల్స్‌ తెలుసుకోలేకపోయానని, స్పైడర్‌ విషయంలో మహేష్‌ను తమిళ ఆడియన్స్‌కు పరిచయం చేయాలనుకున్నానే తప్ప తెలుగు ప్రేక్షకులు మహేష్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో అది మిస్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అన్తేకకుండా త్వరలో తెలుగులో ఓ సినిమాని చేయబోతున్నానని చెప్పుకొచ్చాడు. నిజానికి గతంలో మురుగదాస్‌ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ఆయనతో ఉంటుంది అని అనుకోవచ్చు. అందుకే ఈ విషయం మీద కూడా  మురుగదాస్ స్పందించాడు. చాలా రోజులుగా కిందట ఎన్టీఆర్‌కు ఓ కథ చెప్పిన మాట వాస్తవమేనని, కానీ ఆ ప్రాజెక్ట్ వర్క్‌ అవుట్ కాలేదని ప్రస్తుతం అయితే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్ని అవాస్తవమని చెప్పుకొచ్చాడు. మరి తెలుగులో ఈయనతో సినిమా ఒప్పుకున్నది ఎవరో క్లారిటీ లేదు. మురుగదాస్ అంటే స్టార్ హీరోతో సినిమాలు చేస్తాడు కాబట్టి ఆ స్టార్ హీరో ఎవరో మరి.

More Related Stories