English   

మెగా కాంపౌండ్ లోనే హరీష్ శంకర్.. నెక్స్ట్ సినిమా ఎవరితో తెలుసా..

 Harish shankar
2019-12-30 13:43:46

కొందరు దర్శకులకు కొన్ని కుటుంబాలు అలా కనెక్ట్ అవుతాయి. హరీష్ శంకర్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈయన మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉన్నాడు. బయట హీరోలకు తెలియకుండానే దూరం అయిపోతున్నారు హరీష్ శంకర్. ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాల్లో 90% మెగా హీరోలతోనే ఉండటం గమనార్హం. రవితేజతో షాక్, మిరపకాయ.. జూనియర్ ఎన్టీఆర్ తో రామయ్యా వస్తావయ్యా సినిమాలు మినహాయిస్తే మిగిలిన సినిమాలు అన్ని మెగా కాంపౌండ్ లోనే చేసాడు హరీష్ శంకర్. పైగా హీరోలందరికీ ఈ దర్శకుడు బాగా కలిసి వచ్చాడు. 

పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్.. సాయి ధరమ్ కు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.. అల్లు అర్జున్ కు డిజె.. ఈ ఏడాది వరుణ్ తేజ్ కు గద్దలకొండ గణేష్ సినిమాలు ఇచ్చాడు ఈ దర్శకుడు. ఇక ఇప్పుడు మరోసారి మెగా హీరోతో అనే సినిమాకి సిద్ధమవుతున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం ఈయన రామ్ చరణ్ కోసం కధ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే లైన్ అనుకోవడం.. రామ్ చరణ్ కు చెప్పడం.. ఆయన ఓకే అనడం అన్నీ జరిగిపోయాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. 

మరో వైపు రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ 2020 మార్చి నాటికి పూర్తి కానుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాతో బిజీ కానున్నాడు మెగా వారసుడు. మెగా హీరోలందరికీ విజయాలు ఇచ్చిన హరీష్ చరణ్ కూడా మంచి హిట్ ఇస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. చూడాలి మరి ఏం జరుగుతుందో. దానికి తోడు మైత్రి మూవీ మేకర్స్ తో ఇప్పటికే రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు రామ్ చరణ్. 

More Related Stories