English   

మత్తు వదలరా సినిమా చూసిన ప్రభాస్, రానా..

Prabhas Rana
2019-12-30 17:19:32

రాజమౌళి కుటుంబం నుంచి తొలిసారి వచ్చిన హీరోను ఇండస్ట్రీ బాగానే ఆదరిస్తుంది. ప్రేక్షకులు కూడా ఈ వారసుడికి మంచి మార్కులు వేస్తున్నారు. కీరవాణి చిన్న కొడుకు సింహ కోడూరి హీరోగా నటించిన మత్తు వదలరా సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్లేదు అనిపిస్తుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది. కొత్త దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన మత్తు వదలరా ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాను చూసి ఇండస్ట్రీలో హీరోలు కూడా చిత్రయూనిట్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాకు తన వంతు ప్రమోషన్ చేస్తున్నాడు. హీరో సంగీత దర్శకుడు మిగిలిన టీమ్ మెంబర్స్ ని ఇంటర్వ్యూ చేసి తన బాధ్యతలు నిర్వర్తించాడు దర్శకధీరుడు. ఇక ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దగ్గుబాటి రానా కూడా ఈ సినిమాను చూశారు. చూసినవాళ్లు ఊరికే ఉండకుండా సోషల్ మీడియాలో దీనికి ప్రమోషన్ మొదలుపెట్టారు. మత్తు వదలరా సినిమా అద్భుతంగా ఉంది అంటూ దర్శకుడిని ఆకాశానికి ఎత్తేశారు. సింహా నటనపై కూడా వాళ్లు ప్రశంసల జల్లు కురిపించారు. మొన్నటికి మొన్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా చూసి వారెవ్వా అంటూ ట్విట్టర్లో పొగిడేశారు. మొత్తానికి సెలబ్రిటీలు అంతా మత్తు వదలరా సినిమాను బాగానే వెనకేసుకొస్తున్నారు. 

More Related Stories