English   

చిరు సినిమాలో స్పెషల్ సాంగ్...ఆ హీరోయిన్ తో

Chiranjeevi movie update.jpg
2019-12-31 08:33:27

స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ, మెగాస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ లో మొదలయిందని అంటున్నారు. మరోపక్క అది ఇంకా మొదలు కాలేదు ఈ జనవరి తొలి వారంలో మొదలు కానునదని మరో ప్రచారం జరుగుతోంది. ఆ విషయాలు ఎలా ఉన్నా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ సినిమా హీరోయిన్ విషయంలో ముందు నుండీ రకరకాల ప్రచారాలు జరిగాయి. చివరికి త్రిష నేను నటిస్తున్నా అని చెప్పేదాకా ఆ ప్రచారాలు సాగాయి. తాజాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఒక హీరోయిన్ ని సంప్రదిన్చినట్టుగా చెబుతున్నారు. అదేంటంటే ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచే ఒక సాంగ్ లో హీరోయిన్‌ రెజీనా కాసాండ్రా నర్తించనున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఇదే నిజమైతే రెజీనా తక్కువ సమయంలోనే మెగాస్టార్‌ చిరు తో కలిసి డ్యాన్స్‌ చేసే అరుదైన అవకాశాన్ని కొట్టేసినట్టే అని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని రామ్ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ తో పాటు మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సహా నిర్మాణంతో  ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దేవాదాయ శాఖలో జ‌రిగిన అవినీతి నేప‌థ్యంలో రూపొంద‌నున్నట్లు ఈ సినిమా గురించి మొదటి నుండి ప్రచారం జరుగుతోంది.

More Related Stories