English   

సురేందర్ రెడ్డికి షాకిచ్చిన ప్రభాస్

Prabhas Surender Reddy.jpg
2019-12-31 09:19:50

సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంకా తన తరువాతి సినిమాని ప్రకటించలేదు. అయితే త్వరలో సురేందర్ రెడ్డి.. యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్‌తో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇందుకోసం ప్రభాస్‌కు చెందిన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సురేందర్ రెడ్డి సినిమాకి భారీ బడ్జెట్ అంటే దాదాపుగా 200 కోట్ల రూపాయలను కూడా కేటాయించినట్టు ప్రచారం జరిగింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రభాస్‌ కు సురేందర్‌ రెడ్డి ఓ కథ వినిపించగా ఆ కధ విన్న ప్రభాస్‌ ఆ కధతో సినిమా చేసేందుకు నో చెప్పాడట. అయితే ఇది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ ఈ వార్త టాలీవుడ్‌ లో చక్కర్లు కొడుతోంది. పాన్‌ ఇండియా బ్యాక్‌ డ్రాప్‌ కథ మరింత ఎక్కువగా ఉండాలని ఆశించిన ప్రభాస్‌కు..సురేందర్‌ రెడ్డి వినిపించిన కథ లో పాన్‌ ఇండియా కథ లేదనిపించిందట. అందుకే ఆ కధను ప్రభాస్‌ తిరస్కరించినట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే ఆయన్నే కధను మార్చి లేదా కొత్త కధతో రామ్మన్నాడా లేక అసలుకే వద్దన్నాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇక  ఇదిలా ఉంటే ప్రభాస్‌ జాన్‌ షూటింగ్‌ జనవరి తొలివారంలో ప్రారంభం కానుంది. రాధాకృస్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా కధలో మార్పులు దృష్ట్యా షూట్ ఆగింది. ప్యాన్ ఇండియా లెవల్ సినిమాకి ఆ లెవల్ లోనే కధ కావాలని ప్రభాస్ కోరడంతో మళ్ళీ కధ మీద కూర్చున్నాడు దర్శకుడు. ప్రభాస్‌ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోన్న ఈ సినిమాని నూతన సంవత్సరంలో వేసవిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

More Related Stories