English   

నాని కొత్త ప్రయోగం ఈసారి హీరో

 Nani
2019-12-31 12:13:03

హీరో నాని కొత్త ట్యాలెంట్ ని ప్రోత్సహించే పనిలో పడ్డట్టు ఉన్నారు. ఇప్పటి దాకా పెద్దగా కొత్త దర్శకులతో పని చేయని నాని ఈసారి ఒక కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయన కొత్త దర్శకులకి నిర్మాతగా రెండు సార్లు చాన్స్ ఇచ్చాడు. ఒకరి ప్రశాంత్ వర్మ, రెండు శైలేష్ కొలను. ఇక ఈ ఏడాది ‘జెర్సీ’, ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రాలతో రెండు సినిమాల హిట్స్ అందుకున్నాడు నాని. ఇప్పుడీ జోరు 2020లోనూ కొనసాగించదానికి ఆయన అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘వి’ చిత్రం వచ్చే ఏడాది ప్రధమార్థంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆయన నెగటివ్ రోల్ లో దర్శనమివ్వబోతున్నారు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్‌ జగదీష్‌’ చిత్రంతో ఆయన నటించనున్నారు. ఈ సినిమా కూడా 2020లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం నాని ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన శ్రీకాంత్‌ అనే యువ దర్శకుడు ఈ మధ్యనే నానికి చెప్పగా ఆ సినిమా నానికి బాగా నచ్చిందట. అందుకే ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

More Related Stories