English   

మురుగుదాస్ ఇన్నాళ్లకు అసలు నిజం ఒప్పుకున్నాడు..

 AR Murugadoss
2019-12-31 12:36:25

మురుగదాస్.. ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పేరుకు తమిళ దర్శకుడు అయినా కూడా సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఈయన గురించి తెలుసు. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేశాడు ఏ ఆర్ మురుగదాస్. అయితే అన్నీ ఇండస్ట్రీలలో విజయం అందుకున్న ఈయన తెలుగులో మాత్రం ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు. చిరంజీవి, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ తో సినిమాలు చేసినా కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో మురుగదాస్ పూర్తిగా విఫలమయ్యాడు. 

గజినీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చిరంజీవి స్టాలిన్ సినిమా ఇచ్చాడు. కానీ ఆ సినిమా అప్పట్లో పెద్దగా విజయం సాధించలేదు. 2006లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గానే మిగిలిపోయింది. చిరంజీవి ఇమేజ్ అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు మురుగదాస్. ఈ సినిమాలో కాన్సెప్ట్ బాగా ఉన్నా కూడా దాన్ని అనుకున్నట్టుగా తెరకెక్కించడంలో సక్సెస్ కాలేకపోయాడు ఈ దర్శకుడు. 

స్టాలిన్ వచ్చిన పదేళ్ల తర్వాత మహేష్ బాబుతో స్పైడర్ సినిమా చేసాడు మురుగదాస్. ఇది అత్యంత దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అప్పటివరకు మహేష్ బాబు కెరీర్లో ఎప్పుడూ లేనంత దారుణమైన ఫలితాన్ని చూసింది ఈ సినిమా. 120 కోట్ల బిజినెస్ చేసిన స్పైడర్ 50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 

తాజాగా రజనీకాంత్ దర్బార్ సినిమా చేస్తున్న మురుగుదాస్ ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా తెలుగు సినిమాల గురించి మాట్లాడాడు. తెలుగు ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో  విఫలమయ్యానని చెప్పాడు మురుగుదాస్. ఇప్పుడు కాకపోయినా కచ్చితంగా తెలుగులో ఎప్పుడో ఒకసారి హిట్ కొడతారని చెబుతున్నాడు ఈయన. ఆయన చేస్తున్న దర్బార్ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది జనవరి 8న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది. వరస ఫ్లాపుల్లో ఉన్న రజినీకాంత్ కు ఈ సినిమా విజయం కీలకంగా మారింది. 


 

More Related Stories