English   

అల్లు అర్జున్ కావాలని చేస్తున్నాడా.. లేదంటే అనుకోకుండా జరిగిందా..

Ala Vaikuntapuramloo Event
2019-12-31 17:10:32

అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురంలో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. జనవరి 6న ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. యూసఫ్ గూడ పోలీస్ లైన్స్ స్టేడియంలో ఇది జరగనుంది. అయితే దీనికి ఎవరిని అతిథులుగా పిలవాలి అనే విషయంపై ముందు నుంచి కూడా సందిగ్దత నెలకొంది. దానికి ముందు రోజు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుండటం.. దానికి చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ముఖ్య అతిథిగా వెళ్ళనుడటంతో బన్నీ కోసం ఎవరు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అల వైకుంఠపురంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎవరూ రావడం లేదు. కేవలం సినిమా యూనిట్ మాత్రమే ఇందులో పాల్గొనబోతుంది. ముందు ఈ చిత్ర ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించాలని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. ఇదే విషయాన్ని అల్లుఅర్జున్ దగ్గర ప్రస్తావిస్తే ఆయన ఊహించని సమాధానం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తన సినిమాకు ఇతర హీరోల ప్రమోషన్ అవసరం లేదని.. కేవలం తమ సినిమాకు పని చేసిన వాళ్ళు మాత్రమే పిలవండి అంటూ బన్నీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ను కూడా పిలవడం లేదు మేకర్స్. 

కానీ ఇక్కడే మరో కారణం కూడా ఉంది. తన సినిమాకు కాకుండా మహేష్ బాబు సినిమాకు చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్తుండటం బన్నీకి పెద్దగా నచ్చడం లేదని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఎక్కడా నోరు మెదపడం లేదు అల వైకుంఠపురంలో చిత్ర యూనిట్. సినిమాకు పని చేసిన వాళ్ళను అందరికీ పరిచయం చేయడానికి ప్రీ రిలీజ్ వేడుక వాడుకుంటున్నాం అంటున్నారు దర్శక నిర్మాతలు. జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏదేమైనా కూడా అతిథులు ఎవరూ లేకుండా ప్రీ  రిలీజ్ వేడుక జరగడం మాత్రం కాస్త ఆసక్తికరమే. 

More Related Stories