English   

ప్రభాస్ కాదనుకున్న సినిమాలు చూస్తే ఆశ్చర్యపోతారంతే..

prabhas
2020-01-01 05:10:24

ప్రభాస్ కెరీర్ మొదలు పెట్టి దాదాపు 17 ఏళ్లైపోయింది. ఈ మధ్యే 17 ఇయర్స్ కూడా సెలెబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు ప్రభాస్. ఇకపోతే ఈ 17 ఏళ్ళ కెరీర్ లో ఈయన చేసిన సినిమాలు పట్టుమని పాతిక కూడా లేవు. సాహో వరకు ఈయన సినిమాల సంఖ్య 19 మాత్రమే. ప్రస్తుతం 20వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ 17 ఏళ్లలో ఈయన వదిలేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు కెరీర్‌లో కనీసం 10 సినిమాలు వదిలేసుకున్నాడు ప్రభాస్. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా ఉండటం గమనార్హం. మహేష్ బాబు కెరీర్ ను మార్చేసిన ఒక్కడు సినిమాలో ముందు ప్రభాస్ హీరో. ఈ సినిమా కథ కూడా ఎంఎస్ రాజు వెళ్లి కృష్ణంరాజుకు కూడా వినిపించాడని వార్తలున్నాయి. దర్శకుడు గుణశేఖర్ ను తీసుకుని ప్రభాస్, కృష్ణంరాజు లను కలిసి కథ వినిపించినా కూడా కబడ్డీ గేమ్ కదా కనెక్ట్ అవుతుందో లేదో అని వదిలేసుకున్నాడు ప్రభాస్. అదే సినిమా మహేష్ చేసాడు బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక వినాయక్ తెరకెక్కించిన దిల్ సినిమా కథ కూడా ముందు ప్రభాస్ కు చెప్పినా కూడా అప్పుడు మరో సినిమాతో బిజీగా ఉండటంతో వదిలేసుకున్నాడు ఈ హీరో.

రాజమౌళి సింహాద్రి కథ కూడా ముందు ప్రభాస్ కే చెప్పాడు. కానీ స్టూడెంట్ నెం 1 లాంటి క్లాస్ సినిమాని తీసిన దర్శకుడు ఇలాంటి మాస్ సినిమాను హ్యాండిల్ చేస్తాడా లేదా అనే అనుమానంతో ప్రభాస్ రిస్క్ చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఆ రిస్క్ తీసుకున్నాడు. దాంతో సినిమా బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ కెరీర్ మార్చేసిన ఆర్య.. జూనియర్ ఎన్టీఆర్ కు లైఫ్ ఇచ్చిన బృందావనం.. చరణ్ మాస్ హిట్ నాయక్.. రవితేజ బ్లాక్ బస్టర్ కిక్.. ఎన్టీఆర్ ఊసరవెల్లి.. రవితేజ డాన్ శీను.. గోపీచంద్ జిల్ లాంటి సినిమాలు ముందు ప్రభాస్ దగ్గరికి వచ్చిన తర్వాతే మిగిలిన హీరోలకు వెళ్లాయి. మరి ఇందులో ప్రభాస్ కొన్ని చేసినా కూడా ఆయన కెరీర్ ఇప్పుడున్న దానికంటే మరో స్థాయిలో ఉండేదేమో..?

More Related Stories