English   

సమంతకు ఎందులో ఆనందం ఉందో తెలుసా..

sam
2020-01-01 05:23:28

బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు కదా.. కానీ సమంత మాత్రం బ్యూటీ విత్ హార్ట్.. అవును.. అందమే కాదు.. మంచితనం కూడా ఈమెలో బోలెడంత ఉంది. ఇందులో సమంతకు ఎన్ని మార్కులు ఉంటే అన్నీ వేసేయొచ్చు. అంత మంచిది ఈ ముద్దుగుమ్మ. తనకు వచ్చిన దాంట్లో.. సంపాదించిన రూపాయిలో చాలా వరకు సేవ కోసమే ఖర్చు చేస్తుంది సమంత అక్కినేని. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులో సగం డబ్బును వాళ్లకు కాదనకుండా ఇచ్చేయడం సమంత స్టైల్. ఈ సేవాగుణం తనకు రావడానికి కారణం తల్లి అని చెబుతుంది సమంత. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది సమంత అక్కినేని. అక్కడ చాలా మంది పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు.. సర్జరీలు కూడా చేయించింది సమంత. తనకు తెలిసిన స్టార్స్ నుంచి కూడా ఆర్థిక సాయం ప్రత్యూష ఫౌండేషన్ కు ఇప్పిస్తుంది సమంత. అనాథలకు, పేదలకు, వృద్థాశ్రమాలకు కూడా తోచిన సాయం చేస్తూనే ఉంటుంది ఈమె. పైగా అది కూడా తన సొమ్మునే దానం చేస్తుంది కానీ అక్కినేని వారింటి నుంచి కాదు.. మనకు ఉన్నదాంట్లో పక్క వాళ్లకు సాయం చేయడంలోనే కదా అసలు కిక్ ఉంటుంది అంటుంది సమంత. అలాంటప్పుడే భగవంతుని కృప కూడా మనపై కలుగుతుందని చెబుతుంది ఈమె. తన అమ్మ చేతిలో ఏమీ లేకపోయినా అవసరంలో ఉన్న వారికి సాయం చేయడానికి ముందుండేదని.. ఇప్పుడు ఆ లక్షణాన్ని తను కూడా నేర్చుకోవడం గర్వంగా ఉందని చెబుతుంది సమంత. ఏదేమైనా కూడా సంపాదించిన డబ్బును దానం చేయడానికి కూడా మనసుండాలి కదా.. లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం..?

More Related Stories