అది నయన్ కి ఇచ్చిన కౌంటర్ ఏనా

దక్షినాదిన లేడీ సూపర్ స్టార్ హోదాతో వెలుగొందుతోంది నయనతార. సూపర్ స్టార్ రజనీ చంద్రముఖి సినిమాతో కోలీవుడ్ కి పరిచయమైన ఈ కేరళ కుట్టి ఆ సినిమా హిట్ అవడంతో వరుసగా తెలుగు, తమిళ్ సినిమాలలో వరుస సినిమా అవకాశాలు అందుకుని అందరి కంటే ముందుంది. అయితే ఎంత ఆమె లేడీ సూపర్ స్టార్ హోదా అనుభావిస్తున్నా సరే ఆమె మీద ఒక కంప్లైంట్ ఉంది. అదేంటంటే ఆమే తను నటించిన ఏ సినిమా ప్రమోషన్స్ కి రాదు. ఆ సంగతి పక్కన పెడితే ఆమె నటించిన ఒక సినిమా దర్శకుడు తనను మోసం చేసినట్టుగా గతంలో ఒకసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.
అదేంటంటే తమిళ్ స్టార్ హీరో సూర్య- అసిన్ జంటగా మురగదాస్ తెరకెక్కించిన గజిని లో నయనతార కూడా నటించింది. ఈ సినిమాలో నయన్ పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదు. నయనతార హీరోయిన్ గా నిలదొక్కుకొనే ప్రయత్నాలు చేస్తోన్న సమయంలో ఆ పాత్ర దక్కడం అంటే అదృష్టమే. కానీ ఆమె మాత్రం సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్లకి డైరెక్టర్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. గజనీలో ఆ పాత్రకు సంతకం చేయడం తాను తీసుకున్న అతి చెత్త నిర్ణయమని.. కథ నరేషన్ సమయంలో చెప్పిన విధంగా తన పాత్రను తెరపై చూపించలేదని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు చేసి చాలా రోజులు అయినా ఆ విషయాల మీద ఎప్పుడూ మురగదాస్ స్పందించలేదు.
తాజాగా ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార హీరో హీరోయిన్ గా తెరకెక్కించిన దర్బార్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా నయన్ తో వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అభిమాన నటులకు కూడా చిన్న పాత్రలు ఇవాల్సి వస్తుందన్న ఆయన ఆ విషయం మా చేతుల్లో ఉండదని అన్నారు. ఆ విషయంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. నేనొక క్రియేటర్ ని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నయన్ పేరు ప్రస్తావించకున్నా ఇది మాత్రం నయన్ కి ఇచ్చిన కౌంటరే అని అనుకుంటున్నారు.