English   

అల వైకుంఠపురము చూసిన అల్లు వారి ఫ్యామిలీ

Allu Arjun
2020-01-01 11:46:30

అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో  హీరోయిన్‌లుగా పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే మేక‌ర్స్ రిలీజ్ చేసిన టీజర్, పాటలు సినిమా మీద ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమా మీద రోజు రోజుకు అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సామజవరగమనా, రాములో రాములా సాంగ్స్ రెండూ కూడా బాగుండడంతో వాటికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా రషెస్ ని అల్లు అరవింద్ సహా మిగతా కుటుంబసభ్యులు వీక్షించినట్లు మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం. తమ బ్యానర్ నుండి వచ్చే సినిమాలను అందరికంటే ముందుగా తన ఇంట్లో ఉన్న వారందరికీ చూపి వారి ఒపీనియన్ తీసుకునే అలవాటున్న అల్లు అరవింద్, ఈ  సినిమా రషెస్ కూడా చూపారని చెబుతున్నారు. ఈ సినిమా చూశాక సినిమా మీద ఆ గ్యాంగ్ అంతా సినిమా మీద చాలా పాజిటివ్ గా చెప్పారని అంటున్నారు. ఈ టాక్ విన్న అరవింద్ ఈ సినిమా బన్నీ కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచే అవకాశం ఉందని ఫిక్స్ అయ్యాడట. అంతేకాక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డీటీఎస్ మిక్సింగ్ కూడా స్టార్ట్ అయిందట. వీలయినంత త్వరగా ఈ సినిమా సెన్సార్ కూడా జరిపేసి సినిమాను జనవరి 12 గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు చెబుతున్నారు.  
 

More Related Stories