English   

అల వైకుంఠపురము ముందుకు వస్తోందా 

Ala Vaikunthapurramloo release
2020-01-01 12:07:06

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'అల..వైకుంఠపురములో..' పూజా హేగ్దే కథానాయకగా నటిస్తోన్న ఈ సినిమాలో నటి టబు తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ సంక్రాంతికి కూడా తెలుగు బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీనే ఉండనుంది. మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’తో వస్తుండగా, అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’తో రానున్నాడు. ముందుగా ఈ సినిమాలు రెండూ ఓకే రోజు రిలీజ్ కి రెడీ అయ్యాయి. కానీ నిర్మాతల మండలిలో తీసుకున్న నిర్ణయం వలన ఒక సినిమా ముందుకు వచ్చింది. అయితే  అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ‘అల వైకుంఠపురములో’ సినిమా 12 వ తేదీ కాకుండా 10వ తేదీకి మారే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమా మీద నమ్మకంతో రెండు రోజులు ముందుగానే సినిమాని విడుదల చేయాలని, తద్వారా భారీ ఓపెనింగ్స్ సాధించవచ్చనే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినబడుతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తి కావస్తుండడంతో ఈ సినిమాని ముందుగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు చెబుతున్నారు. ఒక వేళ అదే నిజమయితే 9న రజనీ కాంత్ దర్బార్, 10న 'అల వైకుంఠపురములో', 11న సరిలేరు నీకెవ్వరు.. తర్వాత ఎంతమంచివాడవురా సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి.  

More Related Stories