English   

సమ్మర్ రిలీజ్ టార్గెట్ చేసిన ఉప్పెన

Vaishnav Tej
2020-01-01 15:12:17

మెగాస్టార్ చిరంజీవి చిన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా రూపొందుతోన్న డెబ్యూ మూవీ ఉప్పెన. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు శానా దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషించబోతున్నట్లు చిత్ర బృందం గతంలోనే అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ఆయన విలన్‌గా చేయనున్నాడని ప్రచారం జరిగింది. 

వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా కోసం రంగస్థలం ఫేమ్ ఆర్ట్ డైరెక్టర్స్ మోనిక, రామకృష్ణ వేసిన భారీ సెట్‌ హైలైట్ గా నిలవనుంది. ఇక ఈ సినిమాని గతేడాది చివర్లో అంటే డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ అది కుదరక పోవడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇటీవల చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో సమ్మర్ హాలిడేస్ కి సినిమాని రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. 

అందుతున్న సమాచారం ప్రకారం ఉప్పెన ఇంకా సెట్స్ పై ఉండగానే వైష్ణవ్ తేజ్ మరో సినిమాని ఒకే చేసినట్లు తెలుస్తోంది. అలా మొదలైంది, ఓ బేబీ వంటి హిట్ చిత్రాల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీలో నటించబోతున్నాడని ప్రచారం మొదలయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నందినీ రెడ్డితో ఒక సినిమా ప్రకటించింది. కానీ అందులో హీరో హీరోయిన్ సహా ఇంకా ఎవరినీ ప్రకటించలేదు ఆ సినిమాలో ఈయనే హీరో అని అంటున్నారు. అందులో నిజం ఎంత ఉంది అనేది ఆ సినిమా ప్రకటిస్తే కానీ చెప్పలేం.  
 

More Related Stories