మహేష్ కోసం ఎన్టీఆర్...సెంటిమెంట్ కోసమేనా

మహేష్ బాబు, రష్మిక ప్రధాన పాత్రలలో హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. ఈ సినిమాలో మొట్టమొదటి సారిగా ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ నటించడంతో సినిమా మీద ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్‌కి పది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు మేకర్స్. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా జరపనుంది చిత్ర బృందం. మరోవైపు ఇంటర్వ్యూల రూపంలో సినిమాని జనాలలోకి తీసుకెళుతున్నారు.
తాజాగా దర్శకుడు అనీల్ రావిపూడి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమా విశేషాలని పంచుకున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా జనవరి 5వ తేదీ ఎల్ బి స్టేడియం, హైదరాబాద్ లో జరుగనున్నా సంగతి తెలిసిందే. ఈ యూనిట్ కాకుండా ఇప్పుడు సినిమా యూనిట్ మరో స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారని సమాచారం.
మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “మహర్షి ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో జనవరి 9వ తేదీ జరిగే “సరిలేరు నీకెవ్వరు ” మూవీ స్పెషల్ ఈవెంట్ ఒకటి నిర్వహించి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా ఆ ఈవెంట్ కి పిల్వనున్నారని అంటున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.