English   

శ్రీ రెడ్డి దొరికిపోయింది.. ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న వార్త..

sri
2020-01-02 04:55:44

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం శ్రీ రెడ్డి పేరు తెలియని వారు ఉండరు. కేరాఫ్ కాంట్రవర్సీగా నిలుస్తూ ఎప్పటికప్పుడు వివాదాలు సృష్టిస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి. అలాంటి శ్రీ రెడ్డి ఇప్పుడు దొరికిపోయింది. ఎక్కడ ఎప్పుడు ఎలా దొరికిపోయింది అని ఆశ్చర్యపోతున్నారా.. ఇంతకీ విషయం ఏంటంటే శ్రీ రెడ్డి దొరికిపోయింది అనే పేరుతో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమా పోస్టర్ కూడా విడుదలైంది. ప్రస్తుతం ప్రశాంతంగా చెన్నైలో కాలం గడుపుతుంది శ్రీ రెడ్డి. తెలుగు ఇండస్ట్రీలో చాలా మందికి నిద్రలేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడికి వెళ్లి హాయిగా నిద్రపోతుంది. ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇండస్ట్రీలో సంచలనాలకు తెరలేపింది శ్రీరెడ్డి. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరుపడితే వారిపై నోరేసుకుని పడిపోతూ సినీ రాజకీయ రంగాల్లో అలజడి సృష్టించింది.

ఇలాంటి వివాదాస్పద నటి శ్రీరెడ్డి పేరుతో తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆర్యన్‌, ఉపాసన జంటగా రాహుల్‌ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్రీ రెడ్డి దొరికిపోయింది'. మానవ మృగాలకు అనేది ట్యాగ్ లైన్. కొత్త సంవత్సరం సందర్బంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది యూనిట్. టైటిల్ వెరైటీ గా ఉండటంతో విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్వంత్‌ మూవీస్‌ పతాకంపై డి. వెంకటేష్‌ నిర్మిస్తున్నాడు. గణేశ్‌ రాఘవేంద్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు శ్రీరెడ్డికి సంబంధలేకపోయినప్పటికీ.. శ్రీ రెడ్డి అనే టైటిల్‌పై ఆమె అభ్యంతరం తెలిపే అవకాశం ఉందంటున్నారు సినీ పండితులు. మరి తర్వాత తర్వాత ఎలా ఉండబోతుందో చూడాలి.

More Related Stories