English   

శ్రీ రెడ్డిని తమన్నా టార్చర్ పెడుతుందట..

sri
2020-01-02 05:19:36

తెలుగు ఇండస్ట్రీలో అందరికీ టార్చర్ పెడుతుంది శ్రీ రెడ్డి. కానీ ఈమెను టార్చర్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె మరెవరో కాదు తమన్నా భాటియా. ఈమెకి ఏంటి సంబంధం.. తమన్నాతో శ్రీరెడ్డికి ఏంటి రిలేషన్.. ఎందుకు టార్చర్ పెడుతుంది అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు విషయం ఉంది. శ్రీ రెడ్డి ప్రస్తుతం తమిళనాడులో ఉంది. అక్కడ చెన్నై లో మకాం మార్చి ఒక సొంత ఇల్లు కూడా తీసుకుంది. అక్కడ ఉన్న నటుల కోసం తాను నిర్మాతగా మారాలని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. ఇదిలా ఉంటే ఈమె ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఇంటి ముందు ఒక వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతుంది. అందులో తమన్నా హీరోయిన్. సాధారణంగా స్టార్ హీరోయిన్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది అంటే ఉండే కోలాహలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తమన్నా షూటింగ్ లో కూడా గత 15 రోజులుగా ఇదే జరుగుతుంది. వచ్చిపోయే వాళ్ళు అభిమానుల తాకిడితో శ్రీ రెడ్డి ఇంటి ముందు పెద్ద జాతర జరుగుతుంది. వాళ్లను చూసి ఈమెకు మండిపోతుంది. తన ఇంటి ముందు తమన్నా సెక్యూరిటీ గార్డ్స్ న్యూసెన్స్ చేస్తున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. దాంతో ఏం చేయాలో తెలియక.. లైవ్ వీడియోను పోస్ట్ చేస్తూ తన బాధని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. తన ఇంటి ముందు ఉన్నవారంతా తనపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని.. వాళ్లకు చెప్పినా వినిపించుకోలేని స్టేజ్ కి వెళ్ళిపోయారు అంటూ తమన్నా సెక్యురిటీ గార్డ్స్ పై  కారాలు మిరియాలు నూరుతుంది శ్రీ రెడ్డి. అక్కడ తమన్నా షూటింగ్ జరిగితే ఎవరికి గొప్ప అంటూ ప్రశ్నించింది. 15 రోజులుగా షూటింగ్లో పేరుతో తనకు టార్చర్ చూపిస్తున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీ రెడ్డి. ఇంటి ముందే అందరూ ఉంటే సొంత పనులు ఎలా చేసుకుంటానని ప్రశ్నించింది. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని టార్చర్ పెడుతున్నారని.. తనతో పాటు చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చింది. మరి దీనిపై తమన్నా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More Related Stories