English   

సంక్రాంతి లొల్లికి ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు..

Sarileru Nekevvaru Ala Vaikuntapuram.jpg
2020-01-02 08:51:06

సంక్రాంతి సీజన్ వచ్చిందంటే స్టార్ హీరోలు తమ సినిమాలతో సిద్ధంగా ఉంటారు. ప్రతిసారి అదే జరుగుతుంది. ఈసారి కూడా కొత్తగా ఏమీ జరగడం లేదు. ఉన్న పాత ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు స్టార్ హీరోలు. ముఖ్యంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరు సంక్రాంతి పందెం కోళ్ళ మాదిరి బాక్సాఫీస్ దగ్గర కొట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు.. 12న అల వైకుంఠపురంలో సినిమాలు విడుదల చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు దర్శక నిర్మాతలు.

నిజానికి ఈ రెండు సినిమాలు ఒకే రోజు రావాలి అనుకున్నాయి. జనవరి 12న విడుదల చేయాలని ముందుగా పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత కూర్చొని మాట్లాడుకొని మహేష్ బాబు సినిమా ఒకరోజు ముందుగానే విడుదల చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ అల్లు అర్జున్ కూడా మనసు మార్చుకున్నాడు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కంటే ఒకరోజు ముందు తన సినిమాను విడుదల చేయాలని ఈయన ఇప్పుడు సన్నాహాలు చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన అఫిషియల్ కన్ఫర్మేషన్ కూడా వీలైనంత త్వరగా దర్శక నిర్మాతలు చెప్పనున్నారు.

జనవరి 10న అల వైకుంఠపురంలో సినిమాను విడుదల చేయబోతున్నారు గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా సిద్ధమైపోయింది. మరో వైపు జనవరి 11న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు యధావిధిగా విడుదల కానుంది. ఉన్నట్టుండి మళ్లీ మనసు మార్చుకు తన సినిమాను ఒక రోజు ముందే తీసుకొస్తున్నాడు బన్నీ. దీని వెనుక ఆంతర్యం ఏమిటో అల్లు అరవింద్ గ్యాంగ్ కే తెలియాలి.

ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. చివరికి ఈ సంక్రాంతి రేస్ ఎక్కడ ముగుస్తుందో చూడాలి.

More Related Stories